టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (Devi sri Prasad)పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవి శ్రీ ప్రసాద్ ‘ఓ పరి’ ప్రైవేట్ వీడియో సాంగ్‌లో హరే రామ-హరే కృష్ణ అని పాడుతూ అభ్యంతరకంగా డ్యాన్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేవీ శ్రీ ప్రసాద్‌పై సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంలో న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఐటెం సాంగ్లా ఉందని, అందులో హరే రామ హరే కృష్ణ మంత్రం ఎలా వాడతారని పలువురు మండిపడుతున్నారు.
సాంగ్ వీడియోలో అమ్మాయిలతో డీఎస్పీ డ్యాన్స్ చేస్తుండగా.. హరే రామ హరే కృష్ణ లిరిక్స్ కనిపిస్తున్నాయి. సాంగ్ లో హరే రామ లిరిక్స్ తొలగించాలని ఇప్పటికే డిమాండ్స్ తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంపై రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడనేది తెలియాల్సి ఉంది.
వివాదానికి కారణమైన సాంగ్.. వీడియో
Read Also : Hello Meera Trailer | ఇంట్రెస్టింగ్గా గార్గేయి ఎల్లాప్రగడ హలో..మీరా ట్రైలర్.. లాంఛ్ చేసిన వివి వినాయక్
Read Also :Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు కొత్త అప్డేట్.. పవన్ కల్యాణ్‌పై షూటింగ్ !
Read Also : Urvashi Rautela | క్రేజీ టాక్.. చిరంజీవితో స్టెప్పులేయనున్న బాలీవుడ్ భామ