స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా 154 గా వస్తున్న ఈ చిత్రాన్ని బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ చిరులోని మాస్ అవతార్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రం ఊరమాస్ వినోదం అందించడం పక్కా అని టీజర్‌తో తెలిసిపోతుంది. కాగా ఇపుడీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బోయపాటి-రామ్ సినిమాలో ఐటంసాంగ్లో మెరవబోతున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. అయితే ఇపుడీ బ్యూటీ వాల్తేరు వీరయ్యతో కలిసి చిందులేయబోతుందట. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ మీద వచ్చే స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి రౌటేలా డ్యాన్స్ చేయబోతున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
Read Also : Hello Meera Trailer | ఇంట్రెస్టింగ్గా గార్గేయి ఎల్లాప్రగడ హలో..మీరా ట్రైలర్.. లాంఛ్ చేసిన వివి వినాయక్
Read Also :Hari Hara Veera Mallu | హరిహర వీరమల్లు కొత్త అప్డేట్.. పవన్ కల్యాణ్‌పై షూటింగ్ !