స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రభంజనానికి రికార్డులు చెరిగిపోతున్నాయి. ఇటు సినిమాలైతే ఏంటి, అటు సోషల్ మీడియా అయితే ఏంటి బన్నీ పాత రికార్డులని చెరిపేసి అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. గత ఏడాది అల వైకుంఠపురుములో సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేసాడు బన్నీ. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన రికార్డుల హోరు నడుస్తుంది.
తాజాగా బన్నీ సోషల్ మీడియాలో సరికొత్త మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ తాజాగా 12 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు. ఇంత ఫాస్ట్‌గా ఆ మార్క్ సెట్ చేసిన సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ కూడా ఈ ఫీట్‌ని అందుకున్నాడు. కాగా, బన్నీ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడగా, ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని విషెస్ అందించారు.