RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 16 (RC 16) సినిమా కాగా.. మరొకటి సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఆర్సీ 17 ప్రాజెక్ట్. ప్రస్తుతానికి అభిమానులు, మూవీ లవర్స్ ఫోకస్ అంతా బుచ్చి బాబు డైరెక్షన్లో చేస్తున్న సినిమాపైనే ఉంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మూడో షెడ్యూల్ జనవరి 27 నుంచి హైదరాబాద్‌లో మొదలు కానుందని వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా బుచ్చిబాబు టీం ఈ సినిమాకు PEDDI అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిందని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. త్వరలోనే అధికారికంగా టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ ఆసక్తిని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీకపూర్‌కు దేవర తర్వాత తెలుగులో ఇది రెండో సినిమా. ఆర్సీ 16 షూటింగ్‌ను జులైకల్లా పూర్తి చేసి.. దసరా లేదా డిసెంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి తంగలాన్ ఫేం ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Dil Raju | విజయ్ వారిసు కలెక్షన్లు రూ.120 కోట్లే.. ఐటీ అధికారులతో దిల్ రాజు.. ?