RRR | నాటు నాటు పాటను ఎంజాయ్ చేసిన దక్షిణ కొరియా సింగర్
RRR | ప్రపంచ వ్యాప్తంగా (World Wide) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఫీవర్ కొనసాగుతోంది. ఇక ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ (Natu Natu) పాటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ పాటను దక్షిణ కొరియా (South Korean) మ్యూజిక్ బ్యాండ్ (Music Band) ‘బీటీఎస్’ (BTS) సింగర్ జంగ్‌కుక్ (Jungkook) ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
RRR | ప్రపంచ వ్యాప్తంగా (World Wide) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఫీవర్ కొనసాగుతోంది. టాలీవుడ్ (Tollywood) స్టార్ నటులు ఎన్టీఆర్ (NTR) , రామ్‌చరణ్ (Ram Charan) నటించిన ఈ చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ (Natu Natu) పాటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బీట్‌కే చిన్నా, పెద్దా తేడా లేకుండా స్టెప్పులేసి నెట్టింట తెగ సందడి చేస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి దక్షిణ కొరియా (South Korean) మ్యూజిక్ బ్యాండ్ (Music Band) ‘బీటీఎస్’ (BTS) సింగర్ జంగ్‌కుక్ (Jungkook) వచ్చి చేరారు. ఇటీవల అభిమానులతో లైవ్ (Weverse Live) నిర్వహించిన జంగ్‌కుక్ (Jungkook) .. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు..’ (Natu Natu) పాటను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. తన సీటులో కూర్చొనే నాటు నాటుకు సరదాగా స్టెప్పులేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియో చూసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీం తాజాగా స్పందించింది. ‘జంగ్‌కుక్ (Jungkook).. ఈ పాటను నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావా. చాలా సంతోషంగా ఉంది. మీకు, బీటీఎస్ బృందం (BTS Team), దక్షిణ కొరియా (South Korea) మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది.
정국아… ❤️🔥❤️🔥❤️🔥
나뚜나뚜를 너무 좋아해 주셔서 정말 대단해요. 우리는 정국이와 방탄소년단 팀, 그리고 대한민국 전체에 많은 사랑을 보냅니다. #RRRMovie pic.twitter.com/ktAEfc56xB
— RRR Movie (@RRRMovie) March 3, 2023
‘బీటీఎస్’ (BTS) అనేది దక్షిణ కొరియా (South Korea)కు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ (Music Band). జంగ్‌కుక్, ఆర్ఎం, వి, జిమిన్, జిన్, జె.హోప్, సుగా.. ఇలా ఏడుగురు సభ్యులతో ఈ బ్యాండ్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో దీనికి అభిమానులు ఉన్నారు. వీరి నుంచి వచ్చిన ‘ఫేక్ లవ్’, ‘బాయ్ విత్ లవ్’, ‘బటర్’ సాంగ్స్ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి.
కాగా, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును ‘నాటు నాటు..’ సాంగ్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ అందుకున్న విషయం తెలిసిందే.
Also Read..
Rahul Gandhi | బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ
China | అమ్మాయిల లోదుస్తుల ప్రకటనల్లో అబ్బాయిలు.. చైనా వ్యాపారుల కొత్త పంథా..!
Australia | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రహరీ గోడ ధ్వంసం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

