Australia | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రహరీ గోడ ధ్వంసం..!
Australia | ఆస్ట్రేలియా (Australia)లో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై (Hindu temple ) దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై దుండుగులు దాడి చేశారు.
Australia | ఆస్ట్రేలియా (Australia)లో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై (Hindu temple ) దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై దుండుగులు దాడి చేశారు. దక్షిణ బ్రిస్బేన్‌లో ( south of Brisbane) ఉన్న బర్బాంక్ సబర్బ్‌లో (Burbank suburb) గల శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయం (Shree Laxmi Narayan Temple) గోడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఆస్ట్రేలియా టుడే (Australia Today) తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు ఈ విధ్వంసాన్ని గుర్తించి ఆలయ పూజారికి సమాచారం ఇచ్చారు. ఖలిస్థాన్ అనుకూల వాదులే (Khalistani supporters) ఈ దాడికి పాల్పడినట్లు ఆస్ట్రేలియా టుడే (Australia Today) ఆరోపించింది.
కాగా, ఈ ఘటనపై ఆలయ అధ్యక్షుడు సాతిందర్ శుక్లా (Satinder Shukla) మాట్లాడుతూ.. ఆలయ పూజారి (Temple Priest ), భక్తులు (devotees) ఈ ఉదయం తనకు ఫోన్ చేసి దాడి గురించి చెప్పినట్టు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
కాగా, గత రెండు నెలల్లోనే ఆస్ట్రేలియాలో (Australia) హిందూ దేవాలయాల (Hindu temple)పై దాడి జరగడం ఇది నాలుగోసారి. గతంలో బ్రిస్బేన్ (Brisbane)లోని మరో హిందూ దేవాలయం గాయత్రీ మందిర్ (Gayatri Mandir)పై దాడి చేస్తామంటూ పాకిస్థాన్ (Pakistan)లోని లాహోర్ (Lahore)కు చెందిన ఖలిస్థాన్ తీవ్రవాదుల (Khalistan extremists) నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆస్ట్రేలియా టుడే (Australia Today) తెలిపింది. ఆస్ట్రేలియాలోని హిందువులను భయపెట్టేందుకే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని హిందూ హ్యూమన్ రైట్స్ (Hindu Human Rights) డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ (Sarah L Gates) ఆరోపించారు.
Also Read..
Gym | జిమ్‌లో కండలు పెంచేందుకు స్టెరాయిడ్స్.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు
Joe Biden: బైడెన్‌కు స్కిన్ క్యాన్సర్ చికిత్స
Galwan Valley: గాల్వాన్ వ్యాలీలో క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ఆర్మీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

