Gym | జిమ్‌లో కండలు పెంచేందుకు స్టెరాయిడ్స్.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు
Gym | వేగంగా కండలు పెంచుకోవచ్చని ఆశ చూపుతూ జిమ్‌లలో హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓంప్రకాశ్ తన చిన్ననాటి స్నేహితుడైన విశాఖపట్నంకు చెందిన అవినాష్ వద్ద తక్కువ ధరకు హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు తీసుకొని ప్రోటిన్స్ సైప్లెదారు నరేశ్ ద్వారా సయ్యద్ పరూఖ్కు అందిస్తున్నాడు.
Gym | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : వేగంగా కండలు పెంచుకోవచ్చని ఆశ చూపుతూ జిమ్‌లలో హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. సనత్‌నగర్‌కు చెందిన డైసెటి ఓంప్రకాశ్ అమీర్‌పేట్‌లో ప్రోటిన్ సప్లమెంటరీ వ్యాపారం చేస్తుండగా, అంబర్‌పేట్‌కు చెందిన సరోడ్ నరేశ్ సప్లమెంటరీ పౌడర్ సరఫరా, బార్కాస్‌కు చెందిన సయ్యద్ ఫారూఖ్ చాంద్రాయణగుట్టలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఓంప్రకాశ్ తన చిన్ననాటి స్నేహితుడైన విశాఖపట్నంకు చెందిన అవినాష్ వద్ద తక్కువ ధరకు హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు తీసుకొని ప్రోటిన్స్ సైప్లెదారు నరేశ్ ద్వారా సయ్యద్ పరూఖ్కు అందిస్తున్నాడు. అక్కడి నుంచి కస్టమర్లకు సరఫరా అవుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి దాడులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.లక్ష విలువైన 180 ఇంజక్షన్లు, 1100 టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన సైప్లెదారు అవినాష్ పరారీలో ఉన్నాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

