China | అమ్మాయిల లోదుస్తుల ప్రకటనల్లో అబ్బాయిలు.. చైనా వ్యాపారుల కొత్త పంథా..!
China | లోదుస్తుల (Lingerie) ప్రకటనల్లో అమ్మాయిలు (Woman) కనిపించకుండా చైనా (China) ప్రభుత్వం నిషేధం (Banned) విధించింది. దీంతో లోదుస్తుల (Lingerie) ప్రకటన ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్న ఆన్లైన్ (Online) వ్యాపార నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. అమ్మాయిలకు బదులు, అబ్బాయిలకు ( male models ) లోదుస్తులు (Lingerie) వేసి యాడ్స్ షూట్ (Ads shoot) చేస్తున్నారు.
China | లోదుస్తుల (Lingerie) ప్రకటనల్లో అమ్మాయిలు (Woman) కనిపించకుండా చైనా (China) ప్రభుత్వం
నిషేధం (Banned) విధించింది. దీంతో లోదుస్తుల (Lingerie) ప్రకటన ఎలా చేయాలో తెలియక
సతమతమవుతున్న ఆన్లైన్ (Online) వ్యాపార నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రచార
వీడియోలు, ఫొటోల్లో అమ్మాయిలకు బదులు, అబ్బాయిలకు ( male models ) లోదుస్తులు (Lingerie) వేసి
యాడ్స్ షూట్ (Ads shoot) చేస్తున్నారు. ఆ వీడియోలనే ఆన్లైన్లో పోస్టు చేసి ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ( New York Post) ఓ కథనం వెలువరించింది.
ఆ కథనం ప్రకారం.. లోదుస్తులకు సంబంధించిన ఆన్లైన్ ప్రకటనల్లో అమ్మాయిలు ఉండటం వల్ల అశ్లీలత
పెచ్చుమీరుతోందన్న కారణంతో చైనా ప్రభుత్వం ఆయా ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా నిషేధం
విధించింది. అంతేకాదు, ఆన్లైన్ ప్రచారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళలను ఉపయోగించకూడదని
ఆదేశించింది. ఈ మేరకు ఓ చట్టాన్ని సైతం తీసుకొచ్చింది. దీంతో లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో
తెలియక వ్యాపారులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ నష్టాలను అధిగమించేందుకు ఆన్లైన్
వ్యాపార సంస్థలు తాజాగా సరికొత్త ఐడియాతో ముందుకొచ్చేశాయి.
అమ్మాయిల స్థానంలో అబ్బాయిలను నియమించుకొని వారితో లోదుస్తులకు సంబంధించిన యాడ్స్
చేయించారు. వాటిని ఆన్లైన్లో పెట్టి తమ బ్రాండ్లను ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఐడియా
ఫలించడంతో మిగతావారు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుని తమ బ్రాండ్లను మార్కెట్లలో ప్రొమోట్
చేసుకుంటున్నారు. అమ్మాయిల లోదుస్తులు వేసుకున్న అబ్బాయిల వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘షేక్స్పియర్ కాలంలోనూ ఇలాగే ఉండేది.
అప్పట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతి ఉండేది కాదు. అప్పుడు పురుషులే స్త్రీల
పాత్రలను పోషించేవారు’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరైతే ‘ఆ దుస్తులు అమ్మాయిల కంటే..
అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read..
Australia | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రహరీ గోడ ధ్వంసం..!
Covid Origins: కోవిడ్ ఆనవాళ్ల గురించి చెప్పండి : డబ్ల్యూహెచ్వో
Under Eye Bags | కళ్ల కింద క్యారీ బ్యాగులా? ఇలా మీ నయనాలను అందంగా మార్చుకోండి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

