Covid Origins: కోవిడ్ ఆనవాళ్ల గురించి చెప్పండి : డబ్ల్యూహెచ్‌వో
Covid Origins:కోవిడ్ ఆనవాళ్ల గురించి వివరాలు ఉంటే తమతో పంచుకోవాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ తెలిపారు. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీకైనట్లు తాజాగా ఎఫ్‌బీఐ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
జెనీవా: చైనాలో ఉన్న వుహాన్ ల్యాబ్(Wuhan Lab) నుంచే కోవిడ్ వైరస్(Covid Virus) లీకైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వాదనలు మళ్లీ బలం పుంజుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. కోవిడ్19 ఆనవాళ్ల(Covid Origins) గురించి ఎటువంటి సమాచారం తెలిసినా.. ఆ విషయాన్ని తమతో పంచుకోవాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో కోరింది.
వుహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ లీకైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఎఫ్‌బీఐ వద్ద దీనికి సంబంధించిన సమాచారం ఉందని డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. 2019లోనే తొలిసారి చైనా నగరం వుహాన్ నుంచి వైరస్ లీకైనట్లు అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎఫ్‌బీఐ చేసిన ఆరోపణలను చైనా అధికారులు ఖండించారు. తమ దేశంపై అమెరికా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్ ఆరోపించింది.
ఎఫ్‌బీఐ రిపోర్టు నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ స్పందించారు. ఏ దేశం వద్దనైనా కోవిడ్ ఆనవాళ్లకు సంబంధించిన సమాచారం ఉంటే, దాన్ని డబ్ల్యూహెచ్‌వోకు ఇవ్వాలని టెడ్రోస్ కోరారు. కోవిడ్ మహమ్మారి ఆనవాళ్లను గుర్తించే పనిలో డబ్ల్యూహెచ్‌వో ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.
చైనా అధికారులతో పలుమార్లు చర్చించినట్లు కూడా టెడ్రోస్ తెలిపారు. కోవిడ్ గురించి ఎటువంటి డేటా ఉన్నా షేర్ చేయాలని చైనాను కోరినట్లు టెడ్రస్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

