బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) నటిస్తోన్న చిత్రం లాల్ సింగ్ ఛద్దా (Laal Singh Chaddha). అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. యువ హీరో నాగచైతన్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో స్పెషల్ ప్రివ్యూ వేయించాడు అమీర్ ఖాన్. ఈ ప్రీమియర్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసం (Chiranjeevi Home ) వేదికైంది.
అమీర్ ఖాన్, చిరంజీవి మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అమీర్ ఖాన్ ఈ సినిమా ఫస్ట్ ప్రివ్యూ షోను చిరంజీవి కోసం వేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఈ స్పెషల్ షోకు అమీర్‌ఖాన్, చిరుతోపాటు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్, నాగార్జున, నాగచైతన్య హాజరయ్యారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా వస్తోంది లాల్ సింగ్ ఛద్దా. 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అమీర్ ఖాన్. నాలుగేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
Bollywood star #AamirKhan arranged #LalSinghChaddha special premiere show for @KChiruTweets @iamnagarjuna @ssrajamouli #Sukumar and @chay_akkineni recently. pic.twitter.com/c7UopXiV45
— Suresh Kondi (@SureshKondi_) July 14, 2022