Brahmastra Making Video | ‘షంషేరా’తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న రణ్‌బీర్ ఈ సారి ఎలాగైనా ‘బ్రహ్మస్త్ర’తో మంచి విజయాన్ని సాధించాలని కసితో ఉన్నాడు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్వకత్వం వహించాడు. తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో దర్శక దిగ్గజం రాజమౌళి విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. నాగార్జున కీలకపాత్రలో నటించడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఫాంటసీ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై అంతకంతకూ క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజాగా చిత్రబృందం బ్రహ్మస్త్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో చిత్రం కోసం మేకర్స్ ఎంతగా శ్రమించారో కనిపిస్తుంది. ఈ సినిమాతో రణ్‌బీర్ తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా అలియా భట్ హీరోయిన్గా నటించింది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
It's just incredible!
Seems like a dream, which became reality.#Brahmastra is India’s first of its kind film, revolving around beliefs, spirituality & world oldest & biggest destroyer Brahmāstra.#AyanMukerji shared a behind the scene of #RanbirKapoor, #AliaBhatt starrer. pic.twitter.com/LtAcpp1qku
— Ashwani kumar (@BorntobeAshwani) September 4, 2022
Read Also:
Adipurush Movie | ఆ అగ్ర నిర్మాణ సంస్థకు ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులు.. !
Sita Ramam Movie | అప్పుడే ఓటీటీలోకి ‘సీతారామం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Thiruchitrambalam Movie | వంద కోట్ల క్లబ్లో ధనుష్.. తొలి సినిమాగా రికార్డు..!
‘లైగర్’ ఫ్లాప్ అవడంతో.. పూరి-విజయ్‌లు అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారా?