Thiruchitrambalam Movie | వంద కోట్ల క్లబ్లో ధనుష్.. తొలి సినిమాగా రికార్డు..!
Dhanush Enter’s 100 crore Club | ‘3’, ‘రఘువరన్ B-Tech’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ధనుష్. ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు చాలా వరకు తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదలవుతూ వస్తున్నాయి. అయితే తెలుగులో ధనుష్‌కు అంతగా మార్కెట్ లేదు. ప్రస్తుతం ఈయన ఇక్కడ మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ఈయన నటించిన తిరు ఇక్కడ కూడా ఘన విజయం సాధించి ధనుష్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. ఇక తమిళ్ ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలై 15రోజులు అవుతున్నా ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
తిరు చిత్రంతో ధనుష్ 100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ధనుష్‌కు రూ.100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.అంతే కాకుండా ఈ ఏడాది తమిళంలో హైయెస్ట్ ప్రాఫిట్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో ధనుష్‌కు తమిళనాట కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ధనుష్, నిత్యామీనన్ల మధ్య సీన్స్ అయితే వేరే లెవల్లో ఉంటాయి. ఇక ధనుష్ తాత పాత్రలో భారతీరాజా జీవించేశాడు. వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనింపించిన ప్రతిసారి.. ఇలాంటి తాత మనకు కూడా ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Building Collapse | మా ఇల్లే కూలిపోతుందేమోనని పరుగులు పెట్టాం.. ఢిల్లీ ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి
‘ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు’
Rahul Gandhi | నాతో చర్చకు వస్తే మోదీ దేశ ద్రోహి అని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా : రాహుల్‌గాంధీ
Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

