Adipurush Movie | ఆ అగ్ర నిర్మాణ సంస్థకు ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులు.. !
Adipurush Movie Theatrical Rights | ‘బాహుబలి’తో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు . ఈ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ వచ్చిన ప్రభాస్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. రామయణ కథను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి పోస్టర్లు గాని, అప్డేట్లు గాని ఇవ్వకపోయిన.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దక్కించుకుందట. ఆదిపురుష్ హక్కులను భారీ మొత్తంలోనే కొనుగోలు చేసిందట. రాధేశ్యామ్ లాస్‌ను ఈ చిత్రం కవర్ చేస్తుందని యూవీ క్రియేషన్స్ నిర్వాహాకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ప్రభాస్ ఫ్యాన్ డిజైన్ చేసిన ఆదిపురుష్ కాన్సెప్ట్ ఆర్ట్ నెట్టింట తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ చివరి వారంలో ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

