Sita Ramam Movie | అప్పుడే ఓటీటీలోకి ‘సీతారామం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sita Ramam Movie On OTT | ఈ ఏడాది బ్లాక్బాస్టర్ చిత్రాలలో ‘సీతారామం’ ఒకటి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే 80కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం వంద కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా సీతారామం అనూహ్య రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమపై పలువురు టాలీవుడ్ సినీప్రముఖులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో దుల్కర్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. సినిమా విడుదలై 25రోజులు దాటుతున్న ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. తాజాగా సీతారామం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీతారామం ఓటీటీ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందట. స్ట్రీమింగ్ డేట్‌పై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది. సుమంత్, తరుణ్‌భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

