‘లైగర్’ ఫ్లాప్ అవడంతో.. పూరి-విజయ్‌లు అలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారా?
Vijay-Puri Jagannadh’s Janagana Movie | పూరి జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ ప్రాజెక్ట్‌ను ఆపేశాడా? ‘లైగర్’ ఫలితంతో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నాడా? గత రాత్రి నుండి సోషల్ మీడియాలో జనగణమన షూటింగ్ ఆపేశారు అనే వార్తలు జోరందుకుంటున్నాయి. కాగా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైన ‘లైగర్’ మొదటి షో నుండి మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుని నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చింది. పూరి మార్క్ ఎక్కడా కనిపించకపోవడం, హిందీలో షూట్ చేసి తెలుగులో డబ్బింగ్ చేసిన భావన ప్రేక్షకుల్లో కలగడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచాయి. విజయ్ పర్ఫార్మెన్స్ బాగున్న.. నత్తి వల్ల తన క్యారెక్టరైజేషన్ దెబ్బతిందని.. ఇక అనన్యపాండే అటు నటిగా అలరించలేక, ఇటు అందంతో ఆకట్టుకోలేక నానా ఇబ్బందులు పడిందని పలువురు అభిప్రాయపడ్డారు.
దాదాపు 90కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ‘లైగర్’ చిత్రం ఇప్పటివరకు 30కోట్ల మార్కును కూడా టచ్ చేయలేక పోయింది. ఈ సినిమా ఫలితం విజయ్, పూరీ జగన్నాధ్‌లను తీవ్రంగా నిరాశపరిచింది. కాగా ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ‘జన గణ మన’ సినిమాపై పడిందని టాక్. లైగర్‌కు భారీగా నష్టాలు రావడంతో.. జనగణమన నిర్మాతల్లో ఒకరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దాంతో బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చాయట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ చర్చలు జరిపి.. సినిమాను ఆపేయడమే బెటర్ అని నిర్ణయం తీసుకున్నారట. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సందే.
కాగా ‘జనగణమన’ సినిమాను మార్చి చివర్లోనే అధికారికంగా ప్రకటించి, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పూరీకి ఈ చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అత్యంత భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌గా, స్టార్ కాస్ట్‌తో తీయాలని భావించాడు. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టి ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. ఫస్ట్ షెడ్యూల్ కోసం దాదాపు 10కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేసి తనపై కొన్నీ సీన్లను కూడా చిత్రీకరించారు. కానీ లైగర్ దెబ్బ కొట్టడంతో జనగణమన ప్లాన్స్ అన్ని చెల్లాచెదురయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

