Akhanda 2 | టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సీక్వెల్ ప్రాజెక్టుల్లో ఒకటి అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) క్రేజీ కాంబోలో రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అఖండకు సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమాను 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఇటీవలే యూపీలోని మహాకుంభ్‌మేళాలో షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. బోయపాటి టీం ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇదిలా ఉంటే అఖండ 2 కోసం బోయపాటి టీం లొకేషన్ వేటలో పడింది. కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల, కృష్ణానది ప్రాంతంలో షూట్ చేయాలని బాలకృష్ణ-బోయపాటి టీం భావిస్తుందట.
ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీనుతోపాటు చిత్రయూనిట్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించింది. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదీ తీర ప్రాంతాన్ని పరిశీలించి.. అక్కడి స్థానికులతో షూటింగ్‌కు కావాల్సిన అనుకూల పరిస్థితుల గురించి మాట్లాడింది బోయపాటి టీం. బోటులో బోయపాటి టీం లొకేషన్ పరిశీలనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సీక్వెల్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అఖండ 2ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘అఖండ 2’ ఘాటింగ్ కోసం బోయపాటి లోకేషన్ వెతుకులాట – గుడిమెట్లలో షూటింగ్‌కి ఆస్కారం! #boyapati #Balakrishna #Akhanda2 @BoyapatiSrinu @NBK_Unofficial pic.twitter.com/QueZccruxx
— The Politician (@ThePolitician__) January 20, 2025
రిలీజ్ డేట్ ప్రోమో..
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా