Yogibabu | తమిళ కమెడియన్ యోగిబాబు (Yogi Babu), ఓవియా, రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘బూమర్ అంకుల్’ (Boomer Uncle). ఈ సినిమాకు స్వదీస్ ఎమ్ఎస్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలో మంచి కామెడీ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా థియేటర్ అనంతరం ఓటీటీ వేదిక ‘ఆహా తమిళంలో’ (Aha)లో రిలీజైంది. ఇక తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తున్నట్లు కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మేకర్స్ ప్రకటించారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అందుబాటులోకి రానుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా తెలుగు’ (Aha)లో ఈ చిత్రం ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులు. అయితే అనుకోకుండా తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటాడు నేసమ్. దీనికి అమీ కూడా ఒక షరతుపై ఒప్పుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక బంగ్లాలో విదేశీ యువతి అమీతో నేసమ్‌కు ఏర్పడుతుంది. అయితే ఆ బంగ్లాలో దయ్యం ఉన్నట్లు విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో యెగి అండ్ గ్యాంగ్ ఏం చేసింది అనేది సినిమా.
Funny “Boomer” uncle..😛
Will make you laugh out loud!😂
#Boomeruncle premieres July 20th on aha@OviyaaSweetz @HeidenSona @iYogiBabu @thangadurai123 pic.twitter.com/IW0T3upQOh— ahavideoin (@ahavideoIN) July 16, 2024
Also Read..