Harish Rao | బీఆర్ఎస్ నమ్ముకున్నది కార్యకర్తలు, ప్రజలను మాత్రమే.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao | ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారని చెప్పారు. కానీ బీఆర్ఎస్కు ఏమీ కాలేదని, ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు.
Harish Rao | ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారని చెప్పారు. కానీ బీఆర్ఎస్కు ఏమీ కాలేదని, ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. మహిపాల్‌రెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేను చేసిందని గుర్తు చేశారు. గూడెం వెళ్లిపోయినా.. బీఆర్ఎస్ కార్యకర్తలు గుండె ధైర్యంతో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నమ్ముకున్నది కార్యకర్తలను, ప్రజలను మాత్రమే అని స్పష్టం చేశారు. పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డే ఇప్పుడు వివక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని అన్నారు.
కాగా, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన మహిపాల్‌రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీముఖ్యం గా కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. అందుకే మహిపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక కార్యక్రమానికి కాటా శ్రీనివాస్‌గౌడ్ దూరంగా ఉన్నారు. కాటా వర్గానికి చెందిన నాయకులు బాహాటంగానే మహిపాల్‌రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై కాటా, మహిపాల్‌రెడ్డి అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా రెండురోజులుగా వార్ కొనసాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

