Hari Hara Veera Mallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తుంది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘హరి హర వీర మల్లు’ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ.. కొత్త డేట్ ప్రకటిస్తూ.. ఈ సినిమాపై అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతుండగా.. తాజాగా మరోసారి వాయిదా పక్కా అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవర్సీస్లో ఇప్పటికే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ రద్దు అయినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ థియేటర్ల షెడ్యూల్స్ నుంచి కూడా ఈ చిత్రాన్ని తొలగించినట్లు సమాచారం.
ఈ సినిమా విడుదల వాయిదా పడడానికి గల ముఖ్య కారణం.. VFX పనులు ఆలస్యం అవ్వడంతో పాటు… చిత్రయూనిట్ విడుదలకు ముందే ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోంటున్నట్లు తెలుస్తుంది. అలాగే సినిమాను కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రావట్లేదని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ‘హరి హర వీర మల్లు’ సినిమాను జూన్ 12న విడుదల చేయకపోతే, అమెజాన్ ప్రైమ్ వీడియోతో చేసుకున్న ఓటీటీ డీల్ ప్రకారం నిర్మాతకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొత్త డేట్ కోసం విజయ్ దేవరకొండ రాబోతున్న జూలై 04న ఈ సినిమాను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Read More