Oka Yamudi Premakatha | తెలుగులో సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). వచ్చింది మలయాళం నుంచే అయిన తెలుగులో మినిమం గ్యారంటీ హీరోలా మారిపోయాడు ఈ కుర్రహీరో. అయితే దుల్కర్ నటించిన మరో మలయాళ చిత్రం తాజాగా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. దుల్కర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఒరు యమండన్ ప్రేమకథ’. సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను తాజాగా తెలుగులో తీసుకువచ్చింది భవాని మీడియా. ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమాను ‘ఒక యముడి ప్రేమకథ’ పేరుతో విడుదల చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం జాన్ అలియాస్ లల్లూ (దుల్కర్ సల్మాన్) అనే పెయింటర్ కథ. జాన్ ప్రేమ వివాహం చేసుకోవాలని కలలు కంటాడు. ఒకరోజు వార్తాపత్రికలో దియా (నిఖిలా విమల్) అనే అమ్మాయి ఫోటో చూసి, ఆమెను ఇష్టపడతాడు. తన స్నేహితులతో కలిసి ఎంత ప్రయత్నించినా దియా ఆచూకీ దొరకదు. అయితే కొంతకాలం తర్వాత, దియా హత్యకు గురైందని జాన్‌కు తెలుస్తుంది. దీంతో హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దియాను హత్య చేసిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Ever chased a feeling? Not a person, but that spark? Lallu did. #okayamudipremakatha Stream Now on #aha
Link :https://t.co/u5XYB2aKUP#NikhilaVimal #SamyukthaMenon #DulquerSalmaan #SoubinShahir #Bhavanimedia pic.twitter.com/IaLGw1YPwO
— Bhavani Media (@BhavaniHDMovies) June 5, 2025