Boney Kapoor | ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నిర్మల్ కపూర్ (Nirmal Kapoor) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బోనీ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నిర్మల్ కపూర్‌కు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు బోనీ కపూర్, అనిల్ కపూర్ (Anil Kapoor), సంజయ్ కపూర్ (Sanjay Kapoor), కుమార్తె రీనా కపూర్ ఉన్నారు. నిర్మల్ మరణ వార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తల్లి మరణంతో బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌తో కలిసి ముంబైలోని అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నారు. తల్లి మరణంతో కపూర్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకలను గత ఏడాది సెప్టెంబర్‌లో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read..
Actor Ajith | పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు అజిత్
Mahesh Babu | ఏంటి.. రాజమౌళి సడెన్‌గా మహేష్ బాబు మూవీకి బ్రేక్ వేశాడా..!
Singer Sonu Nigam | మ్యూజిక్ కన్సర్ట్‌లో భాష వివాదం.. సింగర్ సోను నిగమ్‌పై పోలీసులకు ఫిర్యాదు