Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు,ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. భారీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాను ఎక్కువ శాతం ఫారెన్ లోనే షూటింగ్ చేయాల్సి ఉండగా, దానికి కొంత సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో షూటింగ్ జరుపుతున్నాడు. చిత్ర తొలి షెడ్యూల్ ఒరిస్సాలో జరిపిన జక్కన్న ఇప్పుడు తాజా షెడ్యూల్‌ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. స్పెషల్ సెట్ వేసి ప్రియాంక చోప్రా, మహేష్ బాబు మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిపినట్టు తెలుస్తోంది.
ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ ఏర్పాట్లు చేస్తున్నారట.ఇందులో కొంత షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. దీని తరువాత కొన్ని రోజులు ఇండియాలోనే షూటింగ్ చేసి ఫారెన్ ప్లైట్ ఎక్కాలని అనుకున్నారట టీమ్. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఇటీవల తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రెన్యూవల్ చేయించారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా సినిమాకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రాజమౌళి సడెన్‌గా ఈ షూటింగ్ కు బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో ఔట్ డోర్ షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఒక నెల పాటు షూటింగ్‌కి బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. దీంతో మహేష్ బాబు తిరిగి ఫారెన్ వెళ్లబోతున్నాడట. ఆ మధ్య తన ఫ్యామిలీతో వెళ్లిన మహేష్ బాబు వారిని అక్కడే వదిలేసి షూటింగ్ కోసం తిరిగి వచ్చాడు. ఇప్పుడు నెల రోజుల బ్రేక్ దొరకడంతో తిరిగి తన ఫ్యామిలీ దగ్గరకి వెళుతున్నాడట. నెల రోజుల గ్యాప్ తర్వాత జక్కన్న చిత్ర షూటింగ్ స్పీడ్ పెంచబోతున్నట్టు తెలుస్తుంది. భారీ ప్లానింగ్‌తో ఈ మూవీని అత్యద్భుతంగా చిత్రీకరిస్తుండగా, ఈ సినిమాతో మహేష్ ఇమేజ్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళబోతోంది. అంతే కాదు ఫస్ట్ డేనే 1000 కోట్లు కలెక్ట్ చేసేలా ఈమూవీ బిజినెస్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట.