Boney Kapoor| శ్రీదేవి ఆస్తి కోసం కోర్టు మెట్లెక్కిన బోని కపూర్.. ఈ వయస్సులో ఇంత కష్టమేంటి?
Boney Kapoor| బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి సి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీ కపూర్ మరియు కూతుళ్లు జాన్వీ, ఖుషీకు ఆ ఆస్తులపై అధికారం ఉన్నప్పటికీ, తాజాగా చెన్నైలోని ఓ స్థిరాస్తి విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది.
Boney Kapoor| బాలీవుడ్ దిగ్గజ నటి శ్రీదేవి సి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించిన ఆమె తన జీవితంలో ఎన్నో విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీ కపూర్ మరియు కూతుళ్లు జాన్వీ, ఖుషీకు ఆ ఆస్తులపై అధికారం ఉన్నప్పటికీ, తాజాగా చెన్నైలోని ఓ స్థిరాస్తి విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది. 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి ఓ స్థిరాస్తిని ఎం.సి. సంబంద ముదలైర్ అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో ముదలైర్కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి సమ్మతితోనే ఈ ఆస్తి శ్రీదేవి పేరుకు మారింది.
అయితే తాజాగా, ముగ్గురు వ్యక్తులు “మేము ముదలైర్ రెండో భార్య పిల్లలము” అంటూ ముందుకు వచ్చారు. తాము ఆ స్థిరాస్తిపై హక్కు కలిగిన వారమని పేర్కొంటూ, ఆ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన బోనీ కపూర్, 2025 ఏప్రిల్ 22న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిటిషన్ ప్రకారం, ముదలైర్ రెండో భార్యను 1975లో వివాహం చేసుకున్నారని ఆ ముగ్గురు పేర్కొంటున్నారు. కానీ ముదలైర్ మొదటి భార్య మాత్రం 1999లోనే మృతిచెందారు. అంటే మొదటి భార్య బతికి ఉన్న సమయంలో రెండో వివాహం జరగడం వలన, హిందూ వారసత్వ చట్టం ప్రకారం, రెండో భార్య పిల్లలు చట్టబద్ధ వారసులుగా గుర్తింపు పొందలేరు అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ముగ్గురు వ్యక్తులు తాంబరం తాలూకా తహశీల్దార్ వద్ద నుండి చట్టబద్ధమైన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. కానీ అది మోసపూరితంగా పొందిన పత్రం అని బోనీ కపూర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తహసీల్దారుని ఆదేశించింది హైకోర్టు. ఈ ఆస్తి వివాదం ప్రస్తుతం తుది నిర్ణయ దశలో ఉంది. తహశీల్దార్ సమర్పించే నివేదిక ఆధారంగా, తదుపరి చర్యలు తీసుకోనున్నారు. బోనీ కపూర్ వాదనకు బలముండడంతో, రెండో భార్య పిల్లలకు హక్కు కలుగదని న్యాయనిపుణులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

