బొమ్మరిల్లు సినిమా మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయి. అందులో బొమ్మరిల్లు కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయి. అందులో బొమ్మరిల్లు కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సిద్ధార్థ్ తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో స్టార్ అయిపోయాడు. 2006లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా అవార్డులు పరంగా కూడా సత్తా చూపించింది. ఇలాంటి అద్భుతమైన సినిమాను కొందరు తెలుగు హీరోలు మిస్ చేసుకున్నారు.
ఈ సినిమాలో ముందుగా సిద్ధార్థ్ హీరో కాదు. ఆయన కంటే ముందు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఈ కథ చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్. కానీ ఎందుకో ఈ కథ వాళ్లకు కనెక్ట్ కాలేదు. అల్లు అర్జున్ ఆసక్తి చూపించినా కూడా కొన్ని పరిస్థితుల కారణంగా బొమ్మరిల్లు అతని చేతి నుంచి జారిపోయింది. కానీ వెంటనే బొమ్మరిల్లు భాస్కర్ తో పరుగు సినిమా చేశాడు అల్లు అర్జున్. ఇద్దరు హీరోలు కాదన్న తర్వాత సిద్ధార్థ లైన్లోకి వచ్చాడు. ఇక అదే సమయంలో బొమ్మరిల్లు బ్యానర్ స్థాపించి దేవదాసు సినిమా తెరకెక్కించాడు వై.వి.యస్.చౌదరి.
బొమ్మరిల్లు టైటిల్ బాగుంది అని దిల్ రాజు అదే ఓకే చేశాడు. 120 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్లిన బొమ్మరిల్లు 105 రోజుల్లో పూర్తి అయిపోయింది. 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రకాష్ రాజ్, జయసుధ క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ఇక హాసినిగా జెనీలియా చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతం. సిద్ధార్థ్ కూడా ఈ సినిమాతో తెలుగులో తన మార్కెట్ రెండింతలు పెంచుకున్నాడు..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

