Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తన ఫామ్‌హౌస్ పొరుగున ఉన్న కేతన్ కక్కర్.. తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ గత ఆగస్టులో కోర్టును ఆశ్రయించాడు. సామాజిక మాధ్యమాల్లో కేతన్ పెడుతున్న వీడియోలు, పోస్టులు తన పరువుకు భంగం కలిగించడంతో పాటు మతవిద్వేషాన్ని రెచ్చగొట్టాలా ఉన్నాయని కోర్టుకు తెలిపాడు.
పన్వెల్‌లో సల్మాన్‌ఖాన్ గణేశ్ ఆలయ భూమిని ఆక్రమించాడని, అలాగే డ్రగ్స్, అవయవాల వ్యాపారం, బాలల అక్రమ రవాణా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కేతన్ ఆరోపించాడు. ఈ మేరకు సల్మాన్ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది.