సుశాంత్ కేసు..మీడియాకు హైకోర్టు సూచన

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో విచారణ జరుపుతున్న ముంబై పోలీసులపై పలు టీవీ ఛానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. ఇవాళ విచారణ సందర్భంగా కోర్టు పలు అంశాలు పేర్కొంది. ఈ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో మీడియా కథనాలు ప్రభావం చూపిస్తాయని కోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి మీడియా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు పేర్కొన్నది.
మీడియా ట్రయల్ కేబుట్ టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ కోడ్ ను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే వరకు పీసీఐ గైడ్లైన్స్ ఫాలో కావాలని నిర్దేశించింది. మీడియా వ్యక్తులు ఏ రిపోర్టింగ్ ఇచ్చినా జర్నలిజం నియమనిబంధనలకు కట్టుబడి ఇవ్వాల్సి ఉంటుందని, లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.
సుశాంత్ సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న టైంలో ఓ మీడియా వర్గం ముంబై పోలీసులను నెగెటివ్ గా చూపించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ...ఎనిమిది మంది మాజీ ఐపీఎస్ అధికారులు అభ్యంతరం తెలిపిన విషయాన్ని ఓ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.