సినీ పరిశ్రమలో రీమేక్స్ చేయడం కొత్తేమీ కాదు. అయితే గతంలో కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ రీమేక్ ట్రెండ్ ఇటీవల కాలంలో చాలా విస్తరించింది. సినిమా నచ్చిందంటే చాలు అది ఏ భాష అని చూడకుండా రీమేక్ చేసేందుకు రెడీ అంటున్నారు హీరోలు. స్టార్ హీరోలు కూడా రీమేక్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. కొంతకాలంగా మలయాళ సినిమాలు వివిధ భాషల్లో రీమేక్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా మలయాళ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) ను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇంతకీ హిందీ వెర్షన్ లో నటించే హీరో ఎవరనే కదా మీ డౌటు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). కాగా మరో బాలీవుడ్ (Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని బీటౌన్ వర్గాల టాక్. ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా..అక్షయ్ కుమార్ సొంత బ్యానర్ లో నిర్మించనున్నాడని సమాచారం.
పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన డ్రైవింగ్ లైసెన్స్ బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్స్ గా నిలిచిన లూసిఫర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని