టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ మీద నమ్మకముంచి తక్కువ పారితోషికంతో సినిమా చేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే బాలీవుడ్ (Bollywood) భామల విషయానికొస్తే ఈ సీన్ రివర్సవుతుంది. ఏ సంగతి అయినా ఫర్వాలేదు కానీ పారితోషికం విషయంలో మాత్రం తగ్గేదేలే అనే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు బీటౌన్ లో వస్తున్న వార్తలు చూస్తే అర్థమవుతుంది.
రణ్ వీర్ సింగ్ హీరోగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే( Deepika Padukone ) ను అనుకున్నారు. తన కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన బన్సాలీ సినిమా అయినా సరే పారితోషికం విషయంలో మాత్రం తగ్గేదేలేదు అంటూ ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గింది దీపికా పదుకొనే. రణ్ వీర్ కు సమానంగా పారితోషికం ఇవ్వాలని దీపికా అడిగిందట. ఈ చిత్రానికి దీపికా దీపికా పదుకొనే రూ. 12 కోట్లు డిమాండ్ చేసినట్టు బీటౌన్ టాక్.
కాగా మరోవైపు విజయేంద్రప్రసాద్ తీయబోయే రామాయణం చిత్రంలో సీత పాత్ర కోసం బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor)పేరు ప్రముఖంగా వినిపస్తూ వస్తోంది. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే భారీగా డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పటివరకు వినిపిస్తోన్న టాక్. కరీనా కపూర్ కూడా ఈ చిత్రంలో నటించేందుకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తుందట. మొత్తానికి సినిమాల పారితోషికం విషయంలో బాలీవుడ్ భామలు తగ్గేదేలే అంటూ దర్శకనిర్మాతలకు తెగేసి చెప్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!