Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోర్‌పై కన్నేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(60 నాటౌట్) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. టీ బ్రేక్ తర్వాత దూకుడు పెంచిన ఇషాన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(72), వైభవ్ సూర్యవంశీ(44)లు శుభారంభమివ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) సౌత్ బౌలర్లను ఉతికేశాడు. అనంతరం కుమార్ కుషగ్ర(26)తో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు ఇషాన్. దాంతో.. ఈస్ట్ మూడొందలకు చేరువైంది.
టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ బ్యాటర్లు దంచేస్తున్నారు. చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్ బౌలర్లను బెంబేలెతిస్తూ ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(72), వైభవ్ సూర్యవంశీ(44) తొలి వికెట్‌కు వంద రన్స్ జోడించారు. అర్ధ శతకానికి చేరువైన వైభవ్‌ను మిలింద్ వెనక్కి పంపినా.. ఈశ్వరన్ పట్టుదలగా ఆడి ఫిఫ్టీ సాధించాడు. అయితే.. అనూహ్యంగా అతడు రనౌటయ్యాక.. శిఖర్ మోహన్(85) ధనాధన్ ఆడాడు. మూడు సిక్సర్లు, 9 ఫోర్లతో 85 పరుగులు చేసిన అతడు.. ఈస్ట్ జోన్ స్కోర్ బోర్డును ఉరికించాడు.
4️⃣,6️⃣,4️⃣
Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥
The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026
సెంచరీ దిశగా సాగుతున్న మోహన్‌ను మిలింద్ బౌల్డ్ చేయగా.. సుదీప్ కుమార్ ఘరమి(6)ని త్రిపురన విజయ్() వెనక్కి పంపాడు. అనంతరం కుమార కుషగ్ర(26 నాటౌట్)జతగా కెప్టెన్ ఇషాన్(60 నాటౌట్) క్రీజునంటుకుపోయాడు. సౌత్ బౌలర్లకు తన స్టయిల్ విధ్వంసం చూపించిన ఇషాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 4 వేల పరగులు మైలురాయిని అధిగమించాడు. అర్ధ శతకంతో తర్వాత దూకుడు పెంచిన అతడు.. కుషగ్రతో ఐదో వికెట్‌కు యాభైకి పైగా రన్స్ జోడించాడు. వీరిద్దరి మెరుపులతో 65 ఓవర్లకు ఈస్ట్ 297/4తో పటిష్ట స్థితిలో ఉంది.