శర్వానంద్ నటిస్తున్న వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ‘జార్జ్‌క్రిష్’. శ్రీనువైట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మానస వారణాసి కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. గురువారం దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్బూస్టర్ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ రెండు విభిన్న మతాలకు చెందిన గెటప్స్‌లో కనిపించారు.
క్రిస్టియన్ జార్జ్, హిందువు క్రిష్ పాత్రల్లో శర్వానంద్ ఆకట్టుకున్నారు. ఈ రెండు పాత్రల చుట్టూ ఉన్న విభిన్న పరిస్థితులు ఏమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, దర్శకత్వం: శ్రీను వైట్ల.