అమరావతి : వైసీపీ మాజీ మంత్రి ఆర్కె రోజా ( RK Roja ) ఏపీలో కూటమి అవినీతి పాలనపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో జరిగిన వైసీపీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. డీఎస్సీ ( DSC ) లో జరిగిన అక్రమాలపై దమ్ముంటే సీబీఐతో విచారణ ( CBI inquiry) జరిపించాలని చంద్రబాబుకు డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025 పరీక్షలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
డీఎస్సీ, టెట్ పరీక్షల రాయకుండానే నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం ఇచ్చారని విమర్శించారు. టీచర్స్ పోస్టులను డబ్బులకు అమ్ముకున్న నీచ సంస్కృతి చంద్రబాబు, లోకేష్‌కు దక్కిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డీఎస్సీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు.
వైఎస్సార్, జగన్ పాలనలోనే వెలిగొండ ప్రాజెక్ట్ 85 శాతం పూర్తికగా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని వైఎస్సార్ ఆనాడే చెప్పాడని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా వైసీపీ బలమైన పునాది వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.