సినిమాలతోనే కాదు..సోషల్ మీడియా పోస్టులతో కూడా తన ఫాలోవర్లకు పసందైన వినోదాన్ని అందిస్తుంది బాలీవుడ్ (Bollywood) అందాల భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor). ఈ బ్యూటీ నెట్టింట పోస్టు పెట్టిందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. తీరిక సమయం దొరికిందంటే తన స్నేహితులతో కలిసి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తుంది జాన్వీ. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ పోస్టులో జాన్వీకపూర్ వెకేషన్ టూర్ వీడియో ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ సరదాగా ఎంజాయ్ చేసింది. స్నేహితులతో పర్వతారోహణ చేసింది. హిల్ స్టేషన్ లోని అందమైన లొకేషన్లలో ఫొటోలు, సెల్ఫీలు దిగింది. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ..ఎక్కడో ఇంద్రధనుస్సు మీద అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆకాశంలో ఇంద్రధనుస్సు (rainbows ) మెరుస్తుండగా..చెట్లు, పర్వతాలు, గ్రీనరీ మధ్యలో నుంచి తన స్నేహితురాలితో కలిసి పరుగెత్తుతున్న వీడియో, ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఎక్కడికి వెళ్లిందనేది తెలియాల్సి ఉంది. జాన్వీకపూర్ ప్రస్తుతం నటిస్తోన్న గుడ్ లక్ జెర్రీ (Good Luck Jerry) షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు కరణ్‌జోహార్ మల్టీస్టారర్ పీరియాడికల్ డ్రామా తఖ్త్‌లో కూడా నటిస్తోంది.
ఇది కూడా చూడండి
నా కొడుకు జైలు నుంచి ఇంటికొచ్చే వరకూ నో ఖీర్, నో స్వీట్స్: గౌరీ ఖాన్
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు