Bollywood heroes in Tollywood | బాలీవుడ్ హీరోలు అంటే మొన్నటి వరకు ఆకాశంలో ఉండేవాళ్లు. మన హీరోల కలెక్షన్స్.. అక్కడి హీరోలకు మొదటి రోజే వచ్చేసేవి. రెండు రోజుల్లో 100 కోట్లు వచ్చే మార్కెట్ వాళ్లది. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు ధీటుగా మన టాలీవుడ్ హీరోలు కూడా తమ మార్కెట్ పెంచుకున్నారు. ఇంకా మాట్లాడితే అక్కడి వాళ్ల కంటే మనోళ్లు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. ప్రభాస్ లాంటి హీరోలు దుమ్ము దులిపేస్తున్నారు. మరోవైపు మన సినిమాలు హిందీ సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసి చూపిస్తున్నాయి. అందుకే టాలీవుడ్ అంటే బాలీవుడ్ కంటే పెద్దది అంటూ కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. దాంతో బాలీవుడ్ హీరోలు మన ఇండస్ట్రీపై మెల్లగా ఫోకస్ చేస్తున్నారు.
అదే సమయంలో మన హీరోలు కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ప్రతి సినిమా హిందీలో విడుదల అవుతున్నాయి. ట్రిపుల్ ఆర్ ( RRR ) సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ జెండా పాతాలని చూస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస నేరుగా ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్పతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇలా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తుండటంతో.. అక్కడి హీరోలు కూడా తెలుగులో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అజయ్ దేవగణ్ ట్రిపుల్ ఆర్ ( RRR ) సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఆయన ఉండేది తక్కువే నిడివే అయినా కూడా కథకు కీలకమైన పాత్ర ఇది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సైతం తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. చిరంజీవి హీరోగా వస్తున్న గాడ్ ఫాదర్ ( Godfather ) సినిమాలో సల్లూ భాయ్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే కన్ఫర్మ్ చేశాడు. అంతిమ్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్.. తాను చిరు సినిమాలో నటించబోతున్నట్లు ఖరారు చేశాడు. అంతేకాదు వెంకటేష్ హీరోగా నటించబోయే సినిమాలోనూ తాను ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు కండల వీరుడు. మొత్తానికి ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో నటించబోతున్నాడు సల్లూ భాయ్. గతంలో చిరంజీవి సైరా సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్లో కనిపించాడు. ఇలా బాలీవుడ్ హీరోలంతా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ కూడా తెలుగులో కాకపోయినా సౌత్ సినిమాల్లో నటిస్తున్నాడు. రజినీకాంత్ 2.0 సినిమాలో విలన్‌గా నటించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
ఏంటి రాజశేఖర్ సినిమాకు నిజంగానే అంత రేట్ ఇస్తున్నారా..?
Shilpa Chowdary: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో..!
Anchor ravi | ఏంటి యాంకర్ రవి మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తున్నాడా..?