Simran | దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ స్టార్ యాక్టర్లతో కలిసి నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగిన నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది సిమ్రాన్ (Simran). గ్లామరస్ రోల్స్‌తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 1995లో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన సిమ్రన్.. హిందీలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, గోవిందా, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్ యాక్టర్లతో నటించింది.
అయితే తన పని (యాక్టింగ్)గురించి బాలీవుడ్‌కు ఇంకా పూర్తిగా తెలియదని.. ఈ విషయం తనను తీవ్ర నిరాశకు లోను చేస్తుందని ఓ చిట్‌చాట్‌లో చెప్పింది సిమ్రాన్. ఈ విషయం గురించి సిమ్రాన్ మాట్లాడుతూ.. మంచి మనసున్న, ఉదార స్వభావం కలిగిన హిందీ జనాలను నేను ఎక్కువగా కలవలేదు. లుక్ టెస్టులకు నేను ఒకే చెప్పినప్పటికీ.. బాలీవుడ్లో ఇప్పటికీ చాలా మంది నేను ఒక పాత్రకు సరిపోతానో..లేదో అని తెలుసుకునేందుకు టెస్ట్ వీడియాలు పంపించమని అడుగుతారు. అంతేకాదు దక్షిణాదిలో నాకు వచ్చే రెమ్యునరేషన్లో పదో వంతుకు పనిచేయాలని వాళ్లు (హిందీ)ఆశిస్తుంటారు. అందుకే వాళ్లకు నిజంగా నా పని తనం గురించి అవగాహన వచ్చిన తర్వాతే హిందీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.
సిమ్రాన్ ఈ మధ్యకాలంలో టైగర్ 3, గుల్మొహర్, సిటడెల్, హనీ బన్నీ సినిమాల్లో నటించింది. ఈ సినిమా బృందాలతో కలిసి పనిచేసినప్పుడు భిన్నమైన అనుభవాలను ఎదుర్కొన్నట్టు చెప్పింది. అయితే గుల్మోహర్ టీంతో కలిసి పనిచేస్తున్నప్పుడు తాను చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తోపాటు పలువురు టాప్ యాక్టర్లతో సూపర్ హిట్స్ అందించింది సిమ్రాన్. ఒకానొక టైంలో సౌతిండస్ట్రీని షేక్ చేసిన ఈ భామ బాలీవుడ్‌పై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tollywood | కూలీ, వార్ 2 చిత్రాలు ఆ చిన్న సినిమా ముందు తేలిపోయాయా.. ఇది కదా సక్సెస్ అంటే..
Pawan Kalyan | బాలకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..!
Chiranjeevi | మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి.. ఏపీ సీఎంని కలిసి మరి..