Singam-3 Shooting Update | బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవలే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ తండ్రి పాత్రలో నటించాడు. కనిపించింది కాసేపే అయినా.. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక ఇటీవలే అజయ్ బెస్ట్ యాక్టర్‌గా ‘తన్హాజీ’ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీయెస్ట్ నటులలో ఈయన ఒకడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ‘సింగం-3’ ఒకటి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌ను గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
తాజాగా రోహిత్ శెట్టి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ప్రకటించాడు. ‘ఇప్పటికే సింగం-3 ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసినట్లు, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు’ తెలిపాడు. ‘ప్రస్తుతం అజయ్ దేవగణ్ తన కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నాడని, తను కూడా సర్కస్‌తో బిజీగా ఉన్నట్లు’ వెల్లడించాడు. ‘సింగం సిరీస్‌లోనే పార్ట్-3 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్’ అని తెలిపాడు. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శెట్టి రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చిత్రాన్ని చేస్తున్నాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. పూజాహెగ్డే రణ్‌వీర్‌కు జోడీగా నటిస్తున్నది.
Read Also:
Tiger Nageshwar Rao Movie | రవితేజ సినిమాలో నేషనల్ అవార్డు నటుడు?
Karthikeya-2 Movie | నిఖిల్ ‘కార్తికేయ-2’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
Manchu Vishnu | చిరు, నాగ్‌లకు పోటీగా మంచు విష్ణు.. గెలిచేది ఎవరు?
Happy Birthday Movie | ఓటీటీలోకి ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?