Tiger Nageshwar Rao Movie | మాస్రాజ రవితేజ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత రవితేజ ‘క్రాక్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఖిలాడీ’, ఇటీవలే విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ రెండు వరుస ఫ్లాప్‌లు ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ను ప్రకటించాడు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డు గ్రహిత అనుపమ్‌ఖేర్ నటించనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఈయన కీలకపాత్రలో నటించనున్నాడు. కాగా త్వరలో విడుదల కాబోతున్న ‘కార్తికేయ-2’ చిత్రంలో కూడా అనుపమ్ కీలకపాత్రలో నటించాడు. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
నాగేశ్వరరావు 70,80 దశకాల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కనుంది అనడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ANUPAM KHER ON BOARD FOR RAVI TEJA'S PAN-INDIA FILM… #AnupamKher will essay a pivotal role in #RaviTeja's first PAN-#India film #TigerNageswaraRao… Costars #NupurSanon and #GayatriBhardwaj… Directed by #Vamsee… Filming in progress. pic.twitter.com/MUzL3ExPfa
— taran adarsh (@taran_adarsh) August 2, 2022