Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ పేరును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మా సంస్కృతి, సంప్రదాయాలపై కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవర్నీ అడగకుండా కేవలం 9 రోజుల్లోనే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ పేరు తీసేస్తే మేం మల్కాజిగిరి అని చెప్పుకోవాలా అని మండిపడ్డారు. సికింద్రాబాద్ పేరు తొలగించిన రేవంత్ రెడ్డి దమ్ముంటే.. హైదరాబాద్ పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.