Mother Dairy |మదర్ డెయిరీలో నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బీర్ల ఐలయ్యకు చెక్ పెట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి ఒత్తిడి మేరకు మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇక కొత్త చైర్మన్గా కోమటిరెడ్డి అనుచరుడు ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా మదర్ డెయిరీపై మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. భవిష్యత్తులో మదర్ డెయిరీ మనుగడ కష్టమే అని వ్యాఖ్యానించారు. గతంలో ఎండీని మార్చాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం పట్టుబట్టారని బయటపెట్టారు.