న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యాలయం ముందు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు(TMC MPs) ధర్నా చేపట్టారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర సర్కారు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆ ఎంపీలు ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని, హోంశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఢిల్లీలో కర్తవ్య భవన్లోకి దూసుకెళ్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన చేపట్టిన ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆందోళన చేపడుతున్న సమయంలో తమను బలవంతంగా లాక్కెళ్లినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో గురువారం ఈడీ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆ సోదాలను ఖండిస్తూ ఇవాళ టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. డెరిక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రాలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లినట్లు ఓ అధికారి చెప్పారు. అయితే వారిని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
#WATCH | Delhi | Detained TMC MPs brought to Parliament Street police station, following their protest outside Union Home Minister Amit Shah’s Office pic.twitter.com/SaYmgEAeYn
— ANI (@ANI) January 9, 2026