Manchu Vishnu | చిరు, నాగ్‌లకు పోటీగా మంచు విష్ణు.. గెలిచేది ఎవరు?
Ginna Movie | ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. ఈయన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి’ వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది. క్రమంగా ఈయన సినిమాలు ఓకే విధంగా ఉండటం.. కొత్తగా ప్రయత్నించకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేది. దాంతో థియేటర్లలో ఈయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గించారు. ఈయన నటించిన గత ఐదారు సినిమాలు కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ‘జిన్నా’ అనే విభిన్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ముస్తాబయ్యాడు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే చిత్రం నుండి విడులైన టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం ఆక్టోబర్ 5న విడుదల కానున్నట్లు విష్ణు ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే అదే రోజున చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు విపరీతమైన బజ్ ఉంది. కానీ ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేదు. మరీ ఈ ఇద్దరు సీనియర్ హీరోల పోటీని తట్టుకుని విష్ణు దసరా విన్నర్‌గా నిలుస్తాడా? లేదా ?అనేది చూడాలి.
ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్, రాజ్‌పుత్ పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
October 5th?! 🤩💪🏽❤️✊🏽🤩
— Vishnu Manchu (@iVishnuManchu) August 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

