శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 20:03:23

ద‌క్షిణాదిలో ప్ర‌తీ ఏడాది ఒక సినిమా చేస్తా

ద‌క్షిణాదిలో ప్ర‌తీ ఏడాది ఒక సినిమా చేస్తా

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఢిల్లీ భామ తాప్సీ. ప‌దేళ్లకు పైగా సినీ కెరీర్ లో గ్లామ‌ర‌స్ రోల్స్ తోపాటు న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌లు చేస్తూ తెలుగు, తమిళం, హిందీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ద‌క్షిణాది ప్రేక్ష‌కులు త‌న‌పై చూపించే ప్రేమాభిమానాల గురించి ఇటీవ‌లే ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ద‌క్షిణాది ప్రేక్ష‌కులు నా సినిమాలంటే ఇష్ట‌ప‌డ‌తారు. నేను హిందీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాత కూడా వారి ఆద‌ర‌ణ కొన‌సాగుతూనే ఉంది. అందుకే నేను ప్ర‌తీ ఏడాది క‌నీసం ఒక తెలుగు, త‌మిళ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పుకొచ్చింది.

ఈ భామ ప్ర‌స్తుతం హిందీలో హ‌సీనా దిల్ రుబా, ర‌ష్మీ రాకెట్‌, లూప్ ల‌పెటా,త‌మిళంలో జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాల్లో  న‌టిస్తోంది. జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్నాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.