గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 18:38:42

మ్యూజిక్ వీడియోకు నోరా ఫ‌తేహి రిహార్స‌ల్స్‌..వీడియో

మ్యూజిక్ వీడియోకు నోరా ఫ‌తేహి రిహార్స‌ల్స్‌..వీడియో

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి సింగ‌ర్, మ్యూజిక్ కంపోజ‌ర్ గురు రాంధ‌వా నాచ్ మేరి రాణి పాట కోసం ఒక్క‌చోట చేరిన విష‌యం తెలిసిందే. ఈ మ్యూజిక్ వీడియో ప్ర‌మోష‌న్స్ కోసం  నోరా-గురు జోడి ఇటీవ‌లే ది క‌పిల్ శ‌ర్మ షో లో సంద‌డి చేసింది. త్వ‌ర‌లో స‌రికొత్త‌గా..మీరు సిద్దంగా ఉన్నారా..? అంటూ గురు రాంధ‌వా ఇన్‌స్టా హ్యాండిల్ లో క్యాప్ష‌న్ ఇచ్చాడు. నాచ్ మెరీ రాణి పెప్పీ సాంగ్ కు నోరా-గురు క‌లిసి స్టెప్పులేస్తున్న వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

చాలా కూల్‌గా, స్టైలిష్ గా ఈ ఇద్ద‌రు సెల‌బ్రిటీలు స్టూడియోలో రిహార్స‌ల్స్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. గ‌తేడాది స్ట్రీట్ డ్యాన్స‌ర్ 3డీ చిత్రంలో త‌న డ్యాన్స్ తో అంద‌రిని అల‌రించిన నోరా..ఇండియాస్ బెస్ట్ డ్యాన్స‌ర్ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo