ఓటీటీ ప్రాజెక్టు మిమి సక్సెస్ తో ఫుల్ జోష్ మీదుంది బాలీవుడ్ (Bollywood)భామ కృతిసనన్ (Kriti Sanon). ఈ బ్యూటీ ప్రస్తుతం భారీ ప్రాజెక్టు ఆదిపురుష్ లో సీత పాత్రలో మెరువబోతుంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. ఈ సుందరి ప్రభాస్ (Prabhas) ను పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన స్టేట్మెంట్ ఇపుడు తెగ వైరల్ అవుతోంది. కృతిసనన్ నోట వచ్చిన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇంతకీ విషయమేంటంటే..కృతిసనన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఓ ప్రశ్నకు సమాధానంగా తన ఇష్టాయిష్టాల గురించి చెప్పింది కృతిసనన్. కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan)తో రొమాన్స్ చేయడం, టైగర్ ష్రాఫ్ (Tiger shroff) తో డేటింగ్ కు వెళ్లడం, ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడమంటే ఇష్టమని చెప్పుకొచ్చింది కృతిసనన్. చాలా కాలం నుంచి ప్రభాస్ ను ఆరాధించే కృతిసనన్ కు..తాజా స్టేట్ మెంట్ తో రెబల్ స్టార్ పై ఉన్న క్రష్ ఏంటో మరోసారి అర్థమవుతోంది.
ఈ భామ అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన బచ్చన్ పాండే విడుదల కావాల్సి ఉంది. మరో రెండు హిందీ ప్రాజెక్టుల షూటింగ్ కూడా పూర్తి చేసింది కృతిసనన్.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!