కాలువలో నీళ్లు లేక వినాయక విగ్రహాలు ధ్వంసం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంలో సర్కార్ తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాకతీయ కెనాల్లో ట్యాంకర్లతో నీటిని నింపినా అవి ఏ మూలకూ సరిపోక విగ్రహాలు మునగలేదు. దీంతో అధికారులు జేసీబీతో విగ్రహాలు పగులకొడుతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా.. నెటిజన్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- ఎస్ఎంలో వీడియోలు వైరల్
- భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తారా?: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్, సెప్టెంబర్ 24 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంలో సర్కార్ తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాకతీయ కెనాల్లో ట్యాంకర్లతో నీటిని నింపినా అవి ఏ మూలకూ సరిపోక విగ్రహాలు మునగలేదు. దీంతో అధికారులు జేసీబీతో విగ్రహాలు పగులకొడుతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా.. నెటిజన్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల మనోభావాలతో ఆటలా?: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. గణేశ్ విగ్రహాలను జేసీబీలతో ఒకదానిపై మరొకటి వేసి ముకలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. నిమజ్జనం కోసం కనీసం 3వేల క్యూసెకుల నీటిని విడుదల చేయాలని మంత్రులను, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ను పలుసార్లు కోరినా పట్టించుకోకపోవడం.. ఇప్పుడు నీళ్లు లేవని విగ్రహాలను ధ్వంసం చేయడమేందని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

