కూతురు రాహాపై అలవిమాలిన ప్రేమను కనబరుస్తుంటారు బాలీవుడ్ భామ అలియాభట్. కన్నతల్లికి బిడ్డపై మమకారం సహజం. కానీ అలియా మాత్రం రాహా విషయంలో వినూత్నంగా ఆలోచిస్తుంటుంది. పాలు తాగే వయసులోనే భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత రిచెస్ట్ కిడ్‌గా రాహా రికార్డు నమోదు చేసుకుంది. దానికి కారణం అలియా ప్రేమే.
ఆ పసిదాని పేరిట 250కోట్లతో ఏకంగా ఓ బంగ్లానే రాసిచ్చేశారు అలియాభట్. దీన్ని బట్టి అలియా దంపతులకు రాహాపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా రాహా గురించి చెబుతూ ‘ఒక తల్లిగా తనకోసం ఇంకా ఏదో చేయాలనుంది. ఒకటి మాత్రం కచ్చితంగా చెబుతాను. టీనేజ్‌కి వచ్చే సరికి తనకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తా.’ అన్నారు అలియాభట్. ఇంతకీ రాహాకు అలియా ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి? అనే విషయం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది.