కూతురు రాహాపై అలవిమాలిన ప్రేమను కనబరుస్తుంటారు బాలీవుడ్ భామ అలియాభట్. కన్నతల్లికి బిడ్డపై మమకారం సహజం. కానీ అలియా మాత్రం రాహా విషయంలో వినూత్నంగా ఆలోచిస్తుంటుంది.
లొకేషన్లో స్టార్ అలియాగా, ఇంట్లో అమ్మగా రెండు బాధ్యతల్నీ సమర్ధవంతంగా నెరవేరుస్తున్నారు అలియాభట్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అభిప్రాయలను పంచుకోవడం అలియాకు అలవాటు.