Devara | జూనియర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ ఓ బ్లడ్ క్యాన్సర్ బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాధిత యువకుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకును బతికించండి అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌ను వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్(19) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ప్రస్తుతం ఆ యువకుడు బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను ఎప్పుడు చనిపోతానో తెలియదు.. తారక్ దేవర సినిమా విడుదలయ్యే వరకు.. అంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు కౌశిక్. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని, చంద్రబాబు, పవన్, జూ.ఎన్టీఆర్ స్పందించాలని అతని తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు.
ఎన్టీఆర్ దేవర సినిమా చూసే వరకూ నన్ను బతికించండి – బ్లడ్ క్యాన్సర్ బాధితుడు
ఏపీకి చెందిన కౌశిక్(19) అనే జూ.ఎన్టీఆర్ అభిమాని మృత్యువుతో పోరాడుతున్నాడు.
బ్లడ్ క్యాన్సర్‌తో బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను బతకనని, తారక్ దేవర సినిమా రిలీజ్ అయ్యే… pic.twitter.com/NxiapL4Ti6
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2024
ఇవి కూడా చదవండి..
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..?
96 Movie Sequel | విజయ్ సేతుపతి, త్రిష ’96’ సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!