96 Movie Sequel | తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ’96’. ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇదే సినిమాను తెలుగులో జాను పేరిటా రీమేక్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్రకటించాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మేయలగన్ (Meiyazhagan). (తెలుగులో సత్య సుందరం) కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ(Karthi), అరవింద స్వామి (Aravindha Swamy) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు ’96’ సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 96 సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. అయితే ఈ మూవీకి సీక్వెల్ చేయాలని ముందుగా అనుకోలేదని.. కానీ దానికి వచ్చిన స్పందన వలన సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్టు కూడా పూర్తయింది. విజయ్ సేతుపతి, త్రిష డేట్స్ దొరికిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నట్లు ప్రేమ్ కుమార్ వెల్లడించారు.
Also Read..