Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టాలీవుడ్ దర్శకుడు మారుతి డైరెక్షన్లో నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలబారు భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు. కాగా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ లుక్ ఒకటి విడుదల చేశారు.
ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో నటిస్తున్నాడు. మున్నాభాయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. భారీగా పెరిగిన తలవెంట్రుకలు, గడ్డంతో సంజూ బాబా పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే.
Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba – @DuttSanjay a very Happy Birthday 💥💥
Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/dZsynaaJme
— BA Raju’s Team (@baraju_SuperHit) July 29, 2025
Sathi Leelavathi Teaser | మెగా కోడలి మూవీ టీజర్.. విడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది..!
90s Re Union | నైంటీస్ స్టార్స్ రీయూనియన్… సీనియర్ హీరో, హీరోయిన్స్ సందడి మాములుగా లేదు..!