Janhvi kapoor | దివంగత అందాల తార శ్రీదేవి గారాలపట్టి, బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi kapoor) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఈ బీటౌన్ భామ తన ఇష్టదైవాన్ని దర్శించుకుంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంది.
తన పిన్ని, నటి మహేశ్వరితో కలిసి బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొంది. పుట్టినరోజు నాడు శ్రీనివాసుడు ఆశీస్సులు తీసుకుంది. ముందుగా ఆలయానికి చేరుకున్న వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’ (Devara) లో నటిస్తోంది. ఈ మూవీతో జాన్వీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
దీంతోపాటు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘ఆర్సీ16’ లోనూ జాన్వీ నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కి జోడీగా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు మేకర్స్. జాన్వీ ఇంకా ఇవే కాకుండా సూర్యతో కూడా తమిళంలో మరో సినిమా చేయబోతుంది.
Today, our beloved #Thangam, #JanhviKapoor, graced Tirumala with her presence ♥️😍@tarak9999 #JrNTR #Devara #HappyBirthdayJanhviKapoor pic.twitter.com/GeKQ7DrGre
— poorna_choudary (@poornachoudary1) March 6, 2024
Also Read..
JanhviKapoor | జాన్వీకపూర్ బర్త్‌డే స్పెషల్.. కొత్త పోస్టర్ పంచుకున్న ‘దేవర’ టీమ్
Lok Sabha | నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..?
Skin cancer | క్యాన్సర్‌ను నియంత్రించే బియ్యం.. చర్మ క్యాన్సర్‌కు చెక్..!